ఎమ్మెల్యే సహాకారంతో వార్డుల అభివృద్ధి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే సహాకారంతో వార్డుల అభివృద్ధి
– ద్వారాకా నగర్లో సీసీ రోడ్డు పనులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డు సమస్యల పరిష్కారంతో అభివృద్ధి జరుగుతోందని పలువురు నాయకులు అన్నారు.

శుక్రవారం తాండూరు పట్టణం 24వ వార్డులోని ద్వారాకా నగర్లో రూ. 1 కోటి 5లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ వార్డు ఇంచార్జ్ కావలి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వార్డు మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ లు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో ద్వారాకా నగర్ నుంచి చించొల్లి రోడ్డు వరకు సీసీ రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు వార్డు ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుభాన్ రెడ్డి, వెంకట్, అజయ్, రమేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బల్దియా పీఠం బీఆర్ఎస్‌దే..!