విద్యార్థి దశలోనే భక్తి భావం పెంపొందించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థి దశలోనే భక్తి భావం పెంపొందించాలి
– తాండూరు విద్యావేత్త పర్యాద రామకృష్ణ
– శ్రీసంస్కార్ విద్యాపీఠ్‌లో రాంమందిర ఉత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల్లో దేశభక్తి, దైవభక్తి భావాలు పెంపొందించేందుకు అందరు శ్రద్ద వహించాలని తాండూరుకు చెందిన ప్రముఖ విద్యావేత్త పర్యాద రామకృష్ణ అన్నారు. అయోధ్యలో రాంమందిరం నిర్మించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ సంస్కార్ విద్యాపీఠ్‌ ప్రైవేట్ పాఠశాలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ విద్యావేత్త, మోటివేషనల్ వక్త పర్యాద రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం పర్యాద రామకృష్ణ చిన్నారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ… విద్యార్థి దశలోనే భక్తి భావం, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ద వహించాలని అన్నారు.

500ఏండ్ల తరువాత అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవడం యావత్ ప్రపంచమే గర్వించదగ్గ విషయం అని అన్నారు. శ్రీరాముని జీవిత చరిత్ర, ఆయన బోధించిన ధర్మం, కర్తవ్యం, రామాయణం పై విద్యార్థులకు అవగాహన కల్పించడం సంతోషదయకమని అన్నారు. అందేవిధంగా శ్రీరాముని వేషధారణ, భక్తి గీతాలు, నాటికలు, విద్యార్థులే స్వయంగా శ్లోకాల పఠనంతో పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి. విజయ్ నిర్మల, వైస్ ప్రిన్సిపల్ కె. సరిత, డైరెక్టర్స్ స్వాతి, పవన్ కుమార్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం..!