కాంగ్రెస్ పార్టీకి షాక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ పార్టీకి షాక్..!
– బీఆర్ఎస్ పార్టీలో చేరిన విఠల్ నాయక్
– పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ గులాబీ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

మంగళవారం వినాయక ఫంక్షన్ హాల్ లో రోహిత్ రెడ్డి విఠల్ నాయక్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ గా పనిచేసిన విఠల్ నాయక్ అనుభవం పార్టీకి ఉపయోగ పడుతుందని అన్నారు. అదేవిధంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి సురేష్ నాయక్, నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రజల ఆశీస్సులు హస్తానికే..!