పోరపాట్లకు తావులేకుండా ఎన్నికల విధులు

తాండూరు రాజకీయం వికారాబాద్

పోరపాట్లకు తావులేకుండా ఎన్నికల విధులు
– శిక్షణ తరగతుల ద్వారా అవగాహన పెంచుకోవాలి
– తరగతులకు గైర్హాజరు అయిన అధికారులపై చర్యలు
– తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు అన్నారు. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియపై రెండు రోజులుగా పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ పాఠశాలలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం జరిగిన శిక్షణ తరగతులను ఆర్డీఓ శ్రీనివాస్ రావు సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ శిక్షణ తరగతులను అందరు సద్వినియోం చేసుకోవాలని సూచించారు. తరగతుల్లో సూచించిన విధంగా, ఎన్నికల సంఘం నియమావళీని అనుసరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా. ఎన్నికల విధులను నిర్వహించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యేలా దృష్టిసారించాలన్నారు. అదేవిధంగా గత రెండు రోజులుగా నిర్వహించిన శిక్షణ తరగతులకు 598 మందికి గాను 554 మంది హాజరు కాగా, 31 మందికి ఇతర ఎన్నికల విధులు కేటాయించడం జరిగిందన్నారు.

దీంతో పాటు తరగతులకు గైర్హాజరు అయిన 13 మందిపై చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ కు నివేధిక అందించినట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు తారాసింగ్, కిషన్, వెంకటేష్, మునీరోద్దీన్, రెవన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బీఆర్ఎస్ పార్టీకి షాక్..!