సాయిపూర్ అంతా కారుకే జై..!
– ప్రచారంలో పట్లోళ్ల దంపతుల దూకుడు
– 9,10వ వార్డులలో ఇంటింటికి బీఆర్ఎస్
– పట్లోళ్ల నర్సింలుకు, దీపాకు ఆదరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్లో బీఆర్ఎస్ పార్టీ దూసుకపోతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సాయిపూర్ అంతా కారుకే జై కొడుతున్నారు. సాయిపూర్లోని 9వ వార్డు అభ్యర్థిని మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, 10వ వార్డు నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్లోళ్ల నర్సింలుకు ఆయా వార్డు ప్రజలు జేజేలు కొడుతున్నారు.

శుక్రవారం 9వ వార్డులో దీపా నర్సింలు ప్రచారం నిర్వహించగా ఆమెకు మద్దతుగా ఆమె సహోదరి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మ కూడా ప్రచారం నిర్వహించారు. 10వ వార్డులో పట్లోళ్ల నర్సింలు ఉదయం నుంచే ఇంటింటి ప్రచారానికి కదులుతున్నారు. ప్లకార్టులు, నమూనా పత్రాలను పంచుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. దంపతుల ముమ్మర ప్రచారానికి సాయిపూర్లో మంచి ఆదరణ దక్కుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు వారికి భరోసా అందిస్తున్నారు. ఈ సారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పట్లోళ్ల కుటుంబం గెలిస్తే ఆ కుటుంబానికి నాలుగో సారి కౌన్సిలర్ పదవి, మున్సిపల్ మాజీ వైస్ దీపా నర్సింలుకు రెండో సారి పదవి దక్కబోతోంది.

ఇదికూడా చదవండి…

