మున్సి’పోల్ ‘కు రెడీ..!
– ఓటింగ్ కు సర్వం సిద్ధం
– ఎన్నికల అధికారులకు సామాగ్రి పంపిణీ
– డీఆర్సీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
– పర్యవేక్షించిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధం అయ్యింది. రేపు జరిగే ఓటింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తాండూరు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్ లో డీఆర్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
మంగళవారం ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది కేంద్రానికి చేరుకున్నారు. డిఆర్వో మంగీలాల్, ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, తహాసిల్దార్ తారా సింగ్, ఇతర అధికారులు పోలింగ్ అధికారుల విధులు సామాగ్రి పంపిణీలను పర్యవేక్షించారు.
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
మరోవైపు తాండూరులోని డీఆర్సీ కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించి పరిశీలించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని 36 వార్డులకు గాను 117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు.

మొత్తం తొమ్మిది జోన్లలో అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరు చేసుకుని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బ్యాలెట్ పత్రాలు, బాక్సులు జాగ్రత్తగా చెక్ చేసుకొని సర్దుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ తర్వాత పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటింగ్ నిర్వహణ పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జాగ్రత్తలు సూచించారు. ఏమైనా లోపాలు అనుమానాలు కలిగితే అధికారం సంప్రదించి చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు విద్యుత్ దీపాలు పార్కింగ్ ప్రదేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి…

