ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనన్న మానవత్వం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనన్న మానవత్వం
– మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
– చెన్‌గెష్‌పూర్‌ సర్పంచ్‌ చేతుల మీదుగా అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు.

తాండూరు మండలం చెన్‌గెష్‌పూర్ గ్రామానికి చెందిన జులేకా బేగం అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామ సర్పంచ్ వై. ప్రవీణ్ కుమార్ ద్వారా విషయం తెలుసుకున్న ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో ఆయన స్పందించారు. వెంటనే మృతురాలు కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం రూ. 5వేల ఆర్థిక సాయం అందజేశారు.

దీంతో సర్పంచు వై.ప్రవీణ్ కుమార్ గౌడ్ చేతుల మీదగా మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ప్రవీణ్ కుమార్ గౌడ్ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కౌంటింగ్‌.. కౌంట్ డౌన్..!