కాశీ విశ్వేశ్వర యాత్రకు తాండూరు భక్తులు
– యాత్రను ప్రారంభించిన శంకర్ యాదవ్
– హవా మల్లినాథ్ మహరాజ్ సహాకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన భక్తులు కాశీ విశ్వేశ్వర యాత్రకు బయల్దేరి వెళ్లారు. శ్రీహవా మల్లి నాథ్ మహారాజ్ సహకారంతో ఈ యాత్రకు ఏర్పాటు చేశారు.

గురువారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ హాల్ సమీపంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం నుంచి భక్తులు యాత్రకు బయల్దేరారు. ఈ కార్యక్రమానికి తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ శ్రీ సాయి పుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ ముఖ్యఅతిథిగా యాత్రను ప్రారంభించారు. అంతకుముందు దర్మీది రవిశంకర్ ఆధ్వర్యంలో యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ కాశీ విశ్వేశ్వర యాత్రకు హవా శ్రీనాథ్ మహారాజ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

అంతేకాకుండా భారతదేశంలో దాదాపు 8వేల వేల శివలింగాలను స్థాపించడం గొప్ప విషయం అని కొనియాడారు. కాశీలో అమరవీరుల కుటుంబ సభ్యులకు ఘనంగా సన్మానం చేసేందుకు హావ మహారాజ్ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అశోక్ కుమార్ యాదవ్, మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్, పూజారి పాండు, మనోహర్ యాదవ్, జొన్నల వినోద్ కుమార్, గడ్డలి రవీందర్, చెంగోల్ అంజిల్ రెడ్డి, కేశవరావు, కల్వ లక్ష్మీనారాయణ, గాజుల శాంత్ కుమార్, భక్తులు తదితరులు ఉన్నారు.


