సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభం
– పూజలు నిర్వహించి ప్రారంభించిన సీంఎ కేసీఆర్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభమయ్యింది. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరైన సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నేపల్లిలో సమీకృత కలెక్టరేట్‌కు 34 ఎకరాల భూమి కేటాయించగా రూ.60.70కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కాలే యాదయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


