ఎన్టీఎస్ఈ పరీక్ష దరఖాస్తు గడువు పొడగింపు
– వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఉన్నత విద్యలో ఉపకార వేతనాలు పొందేందుకు నిర్వహించే ఎన్టీఎస్ఈ(నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషనల్) లెవల్ -1 పరీక్ష దరఖాస్తుకు గడువు పొడగించినట్లు వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 2 వరకు పొడగించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ లెవెల్ – 1 పరీక్ష పదో తరగతి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులని చెప్పారు. ఇందుకోసం విద్యార్థుల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేస్తున్న విద్యార్థుల వివరాలను డిసెంబర్ 4 వరకు అందరు ప్రధానోపాధ్యాయులు రిజిష్టర్ చేయాలని సూచించారు. ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ చేసిన దరఖాస్తులతో పాటు ఫీజు, చాలను, కావాల్సిన డాక్యుమెంట్లు జతపరచి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డిసెంబర్ 6వ తేదీ వరకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు ఈ పరీక్ష జనవరి, 2022 న ఉంటుందని తెలిపారు.

