తాండూరు అభివృద్ధికి సహాకారం అందించండి
– జిల్లా కలెక్టర్‌ను కలిసిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి కోరారు.

తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లతో కలిసి ఆమె జిల్లా కలెక్టర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్‌తో భేటి అయ్యారు. తాండూరు పట్టణ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో తాండూరు పట్టణ అభివృద్ధికి సహాకారం అందించాలని చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి తెలిపారు. అనంతరం వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ కుమార్‌ను కూడా కలిసి సన్మానం చేశారు.


