ప్రతిపక్షంలో ఉంటే ప్రోటోకాల్ పాటించరా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రతిపక్షంలో ఉంటే ప్రోటోకాల్ పాటించరా..!
– బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ఆవేదన
– ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యటనపై సమాచారం కరువు
– తెలుసుకుని వచ్చినా నెట్టివేసిన వైనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా అధికార పార్టీ ప్రోటోకాల్ పాటించరా అంటూ బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ ఆవేధన వ్యక్తం చేశారు.

శుక్రవారం తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి పర్యటనకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌లు వచ్చారు. మాతా శిశు ఆసుపత్రి తన వార్డులోకి వస్తుందని కౌన్సిలర్ జావిద్ తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్ వచ్చారని తెలిసి ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని జావిత్ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే పర్యటనకు వచ్చినా తనకు సమాచారం ఇవ్వలేదని వాపోయారు.

ఎమ్మెల్యే పర్యటనలో పాల్గొనేందుకు వెళ్లగా అధికారులు తనను నెట్టివేశారని మనోవేధన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారే ప్రోటోకాల్ పాటించకపోతే ఇంకా ఎవ్వరు పాటిస్తారని పెదవి విరిచారు. పోలీసులు, అధికారులు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యేను అడిగేందుకు వెళ్లగా క్యాంపు ఆఫీసు వద్ద మాట్లాడుదామని చెప్పారని జావిద్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ నాయకులు ప్రోటోకాల్ పాటించకపోవడం విడ్డూరంగా ఉందని జావిద్ మరోసారి ఆవేధన వ్యక్తం చేశారు.

జావిద్‌ భాయ్‌ దూకుడు..!