మార్కెట్ యార్డులో బీట్లు బంద్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్కెట్ యార్డులో బీట్లు బంద్..!
– ఈ నామ్ కొత్త రూల్‌పై వ్యాపారుల నిరసన
– మార్కెట్ అధికారులకు అసోసియేన్ వినతి
– తాండూరులో నిలిచిపోయిన కొనుగోళ్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ యార్డులో బుధవారం బీట్లు బంద్ అయ్యాయి. వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో దీనికి సంబంధించిన కార్యకలాపాలు నిలిచిపోయాయి.

తాండూరు మార్కెట్ కమిటిలో ఈ నామ్ వ్యవస్థ ద్వారా క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మార్కెట్ కమిటి అధికారులు వ్యాపారుల ద్వారా రైతులకు సంబంధించిన ఆధార్ కార్డు, చిరునామ, సెల్‌ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాలని వ్యాపారులకు సూచించారు. దీనిపై వ్యాపారులు నిరసకు దిగారు. గతంలోనే మార్కెట్ కమిటి కార్యదర్శి సమక్షంలోనే రైతులకు సంబంధించిన ఆధార్ కార్డు, వివరాలు తాము ఇవ్వలేమని తెలిపినట్లు వ్యాపారులు గుర్తుచేస్తున్నారు.

తాజాగా బుధవారం ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు మరోసారి వ్యాపారులు సర్వసభ్య సమావేశం నిర్వహించి.. ఈ నామ్ కొత్త రూల్‌పై చర్చించుకున్నారు. ఇందులో కూడా రైతులకు సంబంధించిన ఆధార్ కార్డు, ఇతర వివరాలు అధికారులకు ఇవ్వడం కష్టమని తెలిపారు. ఇదే విషయంపై తాండూరు మార్కెట్ కమిటి సూపర్ వైజర్ హబీబ్ అల్వికి వినతిపత్రం అందజేశారు.

అంతేకాకుండా ఈ నామ్‌లో భాగంగా లాట్ ఐడీ, గేట్ ఎంట్రీ తప్పక చేయాలని, రైతులు సరుకులు తెచ్చినప్పుడు రైతులను అడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ తరువాతే సరుకుల గ్రేడ్ చేయించాలని, టెండర్ అయిన తరువాత ప్రతి దుకాణంలో దడువైలతో తూకాలు చేయించాలని వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వెంకట రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి పటేల్‌ కిరణ్‌ కుమార్, మాజీ అధ్యక్షులు బంటారం సుధాకర్, కట్కం వీరేందర్, అధికారులు ఎలాంటి లావాదేవిలు జరపకపోవడంతో తాండూరు మార్కెట్ కమిటిలో కొనుగోళ్ల బీట్లు జరగలేదు.

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి..!