భవిష్యత్తు బీఆర్ఎస్‌దే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భవిష్యత్తు బీఆర్ఎస్‌దే..!
– కౌన్సిలర్లు ప్రజల పక్షానే ఉండాలి
– ఓడినోళ్లు గెలిచినోళ్లకంటే ధీటుగా పనిచేయాలి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీదే భవిష్యత్తు ఉండబోతోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో పైలెట్ రోహిత్ రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో నూతనంగా గెలిచిన కౌన్సిలర్లు, పోటీచేసిన అభ్యర్థులతో పాటు పార్టీ క్రియాశీలక నాయకులతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్లు అందరు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు. పార్టీ పరంగా ముందుకు వెళ్లాల్సిన పలు అంశాలపై వారికి దేశానిర్దేశం చేశారు. కొత్తగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు వార్డుల్లో క్రియాశీలకంగా పనిచేయాలని అన్నారు. ఫ్లోర్ లీడర్‌గా నియామకమైన పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందించి ప్రజల పక్షాన పోరాటం చేయాలని అన్నారు. ఎమ్మెల్యే ఇస్తామన్న వార్డుకు 200 ఇండ్లు, పరిగి సభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన తాండూరు మున్సిపాలిటీకి వేయి కోట్ల నిధుల కోసం పోరాటం చేయాలని అన్నారు.

ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి మార్నింగ్ వాక్ చేయాలని అన్నారు. వార్డుల్లో వీధి దీపాలు, మురుగు కాలువలు, ప్రతి ఇంటికి త్రాగు నీరు వంటి కనీస మౌళిక సదుపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా ఓడిపోయిన అభ్యర్థులు బాధపడకుండా గెలిచిన వారికి ధీటుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా గట్టిపోటీ ఇచ్చి 12 వార్డుల్లో గెలిచి 5 వార్డుల్లో అతి తక్కువ మెజారిటీ తో ఓడిపోయమని అన్నారు. ఫలితాలపై ఎవరూ అధైర్య పడకండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మనం గెలుస్తున్నామని, భవిష్యత్తు బీఆర్ఎస్‌ పార్టీదే అని భరోసా అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు, శోభా రాణి సంజీవ్ రావు, ఇర్ఫాన్, ఆసిఫ్, వెంకట్ రెడ్డి, అనురాధ రవీందర్, సుమిత్ గౌడ్, సంతోష్ గౌడ్, బంటారం సుధాకర్, అనిల్ బౌండ్, గుండప్ప, ఎర్రం శ్రీధర్, సంజీవరావు, రుద్రు పాటిల్, ఎజాజ్, ఇంతియాజ్, వెంకట్ చారి, రజాక్, మధుగౌడ్, కరుణాకర్, అబ్రార్ లాల, టిప్పు, ఫైసల్ ఖాన్, అనంత రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేయండి..!