మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు..!
– జారీ చేసిన మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి
– గడువులోగా చెల్లించకుంటే కఠిన చర్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆస్తి పన్నుల చెల్లింపుపై మొండికేస్తున్న బకాయిదారులకు రెడ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. వందశాతం ఆస్తిపన్నుల లక్ష్యం కోసం అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.

తాండూరు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే రెడ్‌ నోటీసులు సిద్దం చేసి.. బకాయిదారులకు అందజేస్తున్నారు. తాజాగా ఆదివారం మున్సిపల్‌ కమిషనర్ మధుసూదన్ రెడ్డి స్వయంగా ఆస్తిపన్నుల వసూళ్లకు పర్యటించారు. ఇందులో భాగంగా ఆస్తిపన్నులు బకాయిలు పడ్డ ఓ యజమానికి రెడ్ నోటీసు అందజేశారు.

రెడ్‌ నోటీసులో పేర్కొన్న గడువులోగా బకాయిలు చెల్లించాలని సూచించారు. గడువు దాటినా బకాయిలు చెల్లించకపోతే మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కావున ప్రజలు తమ ఆస్తి పన్నులను చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్ఐ రాములు, వార్డ్ ఆఫీసర్లు స్నేహ లతా రెడ్డి, అనిల్ కుమార్, తేజస్విని, బిల్ కలెక్టర్ హైమద్ పాల్గొన్నారు.

రోడ్లపై చెత్త వేస్తే జరిమనాలు..!