రోడ్లపై చెత్త వేస్తే జరిమనాలు..!
– పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
– డ్రైనేజీ అక్రమణలు తొలగిచాలి
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విధించక తప్పదని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి కమిషనర్ మధుసూదన్ రెడ్డిలు పట్టణంలోని సాయిపూర్ వార్డులలో పర్యటించారు. ఇందులో భాగంగా వారు ఇంటింటికి వెళ్లి ఇంటింటా చెత్త సేకరణ పై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను రోడ్లపై వేస్తే జరిమానాలు విధించవలసి వస్తుందని చైర్ పర్సన్ ప్రజలకు సూచించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అపరిశుభ్రంగా ఉంటే అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని అన్నారు.

అదేవిధంగా మురుగు కాలువలపై అక్రమంగా నిర్మించుకున్న షెడ్లను తొలగించాలని అన్నారు. కూల్చిన వ్యర్థాలను రోడ్లపై వేయడం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయరాదని సూచించారు. పట్టణ ప్రగతిలో అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, ఉమేష్, వార్డ్ ఆఫీసర్లు స్నేహలత రెడ్డి, తేజస్విని, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ గౌడ్, జవాన్ గౌతపూర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.


