అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు

తాండూరు రాజకీయం వికారాబాద్

అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు
– జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళతాం
– ప్ర‌జ‌ల్లోకి సర్కారు అభివృద్ధి ప‌నులు
– వికారాబాద్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి
– పెద్దేముల్ మండలంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: అభివృద్ధిని అడ్డుకుంటే ఎంత‌టి వారినైనా స‌హించేది లేద‌ని వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునితా మ‌హేంద‌ర్‌రెడ్డి అన్నారు. శ‌నివారం పెద్దేముల్ మండ‌లంలో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డి ప‌ర్య‌టించి వివిధ అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్స‌వం, శంకుస్థాప‌న‌లు చేశారు. రేగొండిలో మురుగు కాలువ ప్రారంభం, మంబాపూర్ లో మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన, గాజిపూర్ గ్రామంలో అంగన్వాడీ భవనాన్నీ ప్రారంభం, పెద్దేముల్ మండల కేంద్రంలో జడ్పి అతిథి గృహం, షాపింగ్ కంప్లెక్స్, సీసీ రోడ్డు పనులను ప్రారంభం, రుద్రారంలో సీసీ రోడ్డు, మారేపల్లి నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ని ప్రారంబించారు.
ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డి మాట్లాడుతూ ప్ర‌భుత్వ అభివృద్ధి ప‌నుల‌ను అడ్డుకుంటే స‌హించేద‌ని అన్నారు. మండ‌ల కేంద్రంలో అభివృద్ధి కోసం వేసిన శిలాఫ‌లాకాన్ని ధ్వంసం చేయ‌డాన్ని ఖండించారు. ఈ విష‌యంలో స‌హించేది లేద‌ని, ధ్వంసం చేయించిన వారిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామ‌ని పేర్కొన్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవాల‌ని సూచించారు. అదేవిధంగా తెలంగాణ ప్ర‌భుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్ద‌పీట వేస్తోంద‌ని అన్నారు. జిల్లాలోని ప్ర‌తి గ్రామానికి వెళ్లి ప్ర‌భుత్వ అభివృద్ధి మంత్రాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌న్నారు. గ్రామాల అభివృద్ధిలో అంద‌రు క‌లిసిరావాల‌న్నారు. ప‌ల్లె ప‌ల్లె అభివృద్ధికి పూర్తి స‌హాకారం ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పెద్దేముల్ మండ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు, టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అధికారులు పాల్గొన్నారు.