కరణ్‌ కోట్‌లో చెట్టుపై పిడుగు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కరణ్‌ కోట్‌లో చెట్టుపై పిడుగు..!
– జనం దూరంగా ఉండడంతో తప్పిన ప్రమాదం
– సెల్‌ ఫోన్‌లో వీడియో తీసిన స్థానికులు

తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో పిడుగు పడింది. కొన్ని రోజులుగా ఆకాల వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి కరణ్‌ కోట్ గ్రామంలో వర్షం కురిసింది.

బస్టాండ్ సమీపంలోని ఓ చెట్టుపై అకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ప్రదేశానికి అడుగుల దూరంలోనే ఓ హోటల్లో జనం ఉన్నారు. పిడుగు పడిన శబ్దానికి ఉలిక్కిపడ్డారు.

పిడుగు పాటు ప్రదేశంలో జనాలు ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పిల్చుకున్నారు. పిడుగు పడిన చెట్టును సెల్‌ ఫోన్లలో వీడియోలు తీశారు. ఆకాల వర్షంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేశారు.

రామ మందిరంలో ఆధ్యాత్మిక శోభ..!