మంచ్.. మజ్జిగ సేవ.. అభినందనీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

మంచ్.. మజ్జిగ సేవ.. అభినందనీయం
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి
– మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మండే వేసవిలో మార్వాడి యువమంచ్ మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరాజబాల్‌ రెడ్డి అన్నారు.

శుక్రవారం తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ప్రతి యేడాది మాదిరిగానే వేసవి సందర్భంగా మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. మంచ్ సభ్యులతో కలిసి బాటసారులకు మజ్జిగను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల కోసం మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మార్వాడి యువమంచ్ ప్రతి యేడాది ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేస్తున్న సేవలను కొనియాడారు. అదేవిధంగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం 40 రోజులు దాతల సహకారంతో నడిపిస్తామని మంచ్ అద్యక్షులు కిషన్ రాఠి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ మండలి అధ్యక్షురాలు కిరణ్ సార్డా, కార్యదర్శి వర్ష సార్డా, కోశాధికారి కల్పన రాఠి, మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, రోహిత్ అగర్వాల్, మంచ్ కార్యదర్శి కరణ్ జైన్, కోశాధికారి భరత్ దేవ్డా, సభ్యులు అనిల్ సార్డా, దినేష్ పర్థాని, అరుణ్ సార్డా, లక్ష్మి నారాయణ బూబ్, రమాకాంత్ పండిట్, సన్నీ అగర్వాల్, సూర్య ప్రకాష్ సోమాని, నితిన్ సోమాని, సునిల్ సార్డా, బ్రిజ్మోహన్ బూబ్, అభిషేక్ సార్డా తదితర సభ్యులు పాల్గొన్నారు.

సీతారాముల కళ్యాణ వైభోగం..!