వర్త్య తారా భాయికి నివాళులు
– వర్దంతిలో పాల్గొన్న విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌కు చెందిన స్వర్గీయ వర్త్యా తారాబాయికి పలువురు నివాళులు అర్పించారు.

ఆదివారం వారి నివాసంలో తారాబాయి మొదటి వర్దంతి నిర్వహించారు. తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ హాజరై తారాబాయి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.

అదేవిధంగా కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ సురేష్ నాయక్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం నాయకుడు రాజ్ కుమార్, డాక్టర్ తుకారం, వర్త్యా ప్రశాంతి, కుటుంబ సభ్యులు (ప్రభుత్వ ఉద్యోగులు)వర్త్య రమేష్ నాయక్, రేణుకబాయి తదితరులు ఉన్నారు.


