రైతుల అభివృద్ధికి సర్కారు కృషి
– కోనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రైతుల అభివృద్ధి సంక్షేమానికి, అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. మంగళవారం తాండూరు మండలానికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పట్టణంలోని డీసీఎంఎస్ గోదాం వద్ద ఏర్పాటు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతుబంధు, రైతుబీమాతో పాటు రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించే మందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.
తాండూరు మండలానికి సంబంధించి 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏ గ్రేడ్ రకానికి రూ. 2060(క్వింటాళ్ కు), బీ గ్రేడ్ రకానికి రూ. 2040(క్వింటాళ్ కు) అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు బాలప్ప, విజయదేవి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాందాస్, వ్యవసాయ శాఖ ఏడీ రుద్రమూర్తి, ఏఓ రజిత, సర్పంచులు రాములు, రాజప్ప గౌడ్, నాయకులు వేణుగౌడ్, రామకృష్ణ గౌడ్, డీసీఎంఎస్ ఇంచార్జ్ ఎల్లయ్య, పాండురంగం, కేంద్రం ఇంచార్జ్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.

