తిరగబడిన పాత తాండూరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తిరగబడిన పాత తాండూరు..!
– ఇసుక ట్రాక్టర్ల రవాణాపై నిరసన
– దారిని మూసేసి ఆందోళన
– చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు వాసులు తిరగబడ్డారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో తిరుగుతున్న ఇసుక ట్రాక్టర్లపై నిరసన వ్యక్తం చేశారు.

పట్టణంలోని 17వ వార్డులో నిజాం సాహి దర్గా సమీపంలో రవాణా మార్గాన్ని మూసేసి నిరనసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ తాండూరు పట్టణం పాత తాండూరు కాగ్నానది నుంచి ఇసుక రవాణా జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజూ 60, 70 ట్రాక్టర్లు తిరుగుతూ భారీ శబ్దాలతో భయాందోళన కలిగిస్తున్నారని ఆన్నారు. అతివేగంతో ఇసుక రవాణా చేయడం వల్ల భయబ్రాంతులకు గురవుతున్నామని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు కేవలం 2ట్రాక్టర్ల చొప్పున మాత్రమే పర్మిషన్ ఇస్తే, మరి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు యధావిధిగా ఒక్కొక్క ట్రాక్టర్ పదుల ట్రిప్పుల చొప్పున అక్రమంగా తోడేస్తున్నారని ఆరోపించారు. ట్రాక్టర్ల రవాణా వల్ల దుమ్ము, దూళీ చెలరేగి ఇళ్లలోకి దుమ్ము రవాడంతో పాటు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. అందుకే ఇసుక రవాణా సాగించే మార్గాన్ని మూసేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా ఇసుక ట్రాక్టర్ల రవాణాపై చర్యలు తీసుకోవాలని తాండూరు తహసీల్దార్ తారాసింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఇసుక ట్రాక్టర్లను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అధికార పార్టీలో ఏకపక్ష పాలన..!