50 ట్రాక్టర్ల ఇసుక సీజ్..!
– పెద్దేముల్ పోలీసుల ముమ్మర దాడులు
– రెవెన్యూ శాఖకు అప్పగింత
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : అక్రమంగా నిల్వ ఉంచిన 50ట్రాక్టర్ల ఇసుకను పెద్దేముల్ పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.

పెద్దేముల్ ఎస్ఐ ప్రశాంత్ వర్దన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మదనంతాపూర్ తాండ, కొండాపూర్ గ్రామాల శివారులో కొందరు అక్రమార్కులు అక్రమంగా ఇసుక నిల్వ ఉంచినట్లు పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఐ ప్రశాంత్ వర్దన్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మర దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో 50ట్రాక్టర్ల వరకు ఇసుకను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఇసుక నిల్వలను సీజ్ చేసి రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు ఎస్ఐ ప్రశాంత్ వర్దన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసినా.. నిల్వ ఉంచిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


