మాజీ ముఖ్యమంత్రి రోషయ్యకు నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కొణిజేటి రోషయ్యకు తాండూరులో నివాళులు అర్పించారు. శనివారం తాండూరు కొత్త మున్సిపల్ భవనంలో ఆర్డీఓ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు, కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ కుమార్‌తో పాటు కౌన్సిలర్లు, అధికారులు రోషయ్య మరణం పట్ల సంతాపం తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, వెంకన్నగౌడ్, ఎంఐఎం కౌన్సిలర్ బోంబీనా, కోఆప్షన్ సభ్యులు, పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్, మున్సిపల్ డీఈ రంగనాథం, మేనేజర్ బుచ్చిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

