పక్కాగా జన గణన

తాండూరు రాజకీయం వికారాబాద్

పక్కాగా జన గణన
– మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి
– తాండూరు పట్టణంలో ఉత్సహాంగా ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో జన గణనను పక్కాగా పూర్తి చేయిస్తామని మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు.

సోమవారం మున్సిపాలిటీ పరిధిలో జన గణన -2027ను ఉత్సహాంగా ప్రారంభమయ్యింది. పట్టణంలోని గాంధీ చౌరస్తా సమీపంలో జన గణనను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. స్థానికంగా ఉన్న ఇళ్లకు మ్యాపింగ్, నెంబర్ రింగ్ చేసే విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం చేపట్టిన జన గణనను పక్కగా పూర్తి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. జన గణనలో భాగంగా ముందుగా ఇండ్ల వివరాలు, సౌకర్యాలకు సంబంధించిన వివరాలను నమోదు చేయిండం జరుగుతుందని అన్నారు. ఎన్యుమరేటర్లు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.

ఇంటింటి లెక్కలను సోమవారం నుంచి జూన్ 9వ తేది వరకు నమోదు చేయడం జరుగుతుందన్నారు. మరోవైపు ప్రజలు యాప్‌ ద్వారా చేపట్టిన స్వియ గణనను కూడా పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, సూపర్వైజర్ అనిల్ కుమార్, వార్డ్ కౌన్సిలర్లు, బిల్ కలెక్టర్, వార్డ్ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు.

అనుమతిలేని నిర్మాణంపై కొరడా