కుల గణనలో బీజేపీ, కాంగ్రెస్ కుట్ర..!
– జన గణనతోనే సరిపెడుతున్న ప్రభుత్వాలు
– బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటాలు తేల్చాల్సిందే
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వాలు కుల గణన చేపట్టకుండా జన గణనతోనే సరిపెడుతున్నయని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ విమర్శించారు.

బుధవారం అయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. దేశంలో ఎంతోమంది నాయకులు కుల గణన చేయాలని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. జన గణనతోనే సరిపెడుతున్నయని అన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జనగణనతో పాటు కుల గణన కూడా చేయాలని డిమాండ్ చేశారు. 1931లో బీసీలు 52 శాతం ఉన్నారని చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప కుల గణన చేపట్టడం లేదని అన్నారు.

గతంలో బీపీ మండల్ కమిషన్ రిపోర్టు ఇచ్చిందని.. దాని ప్రకారం 1990లో బీసీలకు 27శాతం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించడం జరిగింది అని గుర్తు చేశారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్, 12 సంవత్సరాలు బిజెపి పార్టీలు పరిపాలించిన కూడా కుల గణన చేపట్టడం లేదని అన్నారు.

కుల గణన చేస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీలలో అగ్రకులాల దోపిడీ బయటపడుతుందని కుట్రతో కుల గణన చేపట్టడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా జనగణనతో పాటు కుల గణన చేపట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీల వాటా తేల్చాలని డిమాండ్ చేశారు.


