ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం
– పనికిమాలిన విషయాలు జోడిస్తూ విమర్శలు చేయడం సిగ్గుచేటు
– బీఆర్ఎస్‌పై ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు హైడ్రామాలు
– కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బాతుల నాగరాజు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు హెచ్చరించారు.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన పేడ్ ఆర్టిస్టులు నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటని విమర్శించారు. ఎవరి పరిధిలో వారు పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఉంటుందని, ఆ వ్యవస్థ గురించి అవగాహనలేని వారు ప్రతి సమస్యను రాజకీయ కోణంలో చూస్తున్నారని అన్నారు. డ్రగ్స్ కేసులో దొరికిన రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే పై నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రోజుకు ఒక్క తప్పుడు కేసు, రోజుకు ఒక్క సంఘటన జరిగేదని అది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే అందులో నిందితులుగా ఉండేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదని ఎమ్మెల్యే తో పాటు పరిస్థితితులు కూడ మారయని దీనిని జీర్ణించుకోలేని కొంత మంది అనవసర విషయాలకు ఎమ్మెల్యే గారికి ముడిపెడుతూ తప్పుడు ప్రచారం చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే వెంటనే వైద్యుల ద్వారా వివరాలు తెలుసుకోవడంతో పాటు, ఆసుపత్రి పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు .ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్‌తో కలిసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

అలాగే జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారు కూడ హాస్పిటల్ ను సందర్శించి రోగాలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీయడం జరిగిందని, అధికారులు, నాయకులు ఎవరైనా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పని చేస్తారని గుర్తు చేశారు. అయితే స్థానిక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆర్టిస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం తగ్గించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిరుపేద ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రులకు దూరం చేసే కుట్రలను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. అలాగే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే గారిని ముస్లిం సోదరులకు దూరం చేయాలనే ఉద్దేశ్యంతో తాండూర్‌లో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు.

ఎమ్మెల్యే తాండూరు ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తారని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే క్యాంపు కార్యాలయంలో పోలీస్ అధికారులు, మున్సిపల్ ప్రతినిధులు, మైనారిటీ పెద్దలతో సమావేశం నిర్వహించి పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని అభివృద్ధికి సూచనలు ఇస్తే స్వాగతిస్తామని, కానీ అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని హితవు పలికారు.

ఎంసీహెచ్‌ ఘటనపై సీరీయస్‌