పడిలేచిన కరోనా..!
– మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు
– తాండూరులో 123 నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుపై పంజా విసిరిన కరోనా పడిలేచింది. నిన్న కేసులు కాస్త తగ్గుముఖం పట్టిందని అనుకునేలోపే గట్టి దెబ్బతీసింది. శుక్రవారం తాండూరులో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. జిల్లా ఆసుపత్రితో పాటు, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షలలో 123 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మాతా శిశు ఆసుపత్రిలో 83 మందికి పరీక్షలు నిర్వహించగా 21 పాజిటివ్ నమోదు కాగ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 287 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 102 మందికి పాజిటివ్ అని తేలిందని జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ భాస్కర్ తెలిపారు. మరోవైపు ఈనెల 12 న 9 మందికి, 13న 22 మందికి, 14న 26 మందికి, 16న 43 మందికి, సోమవారం 17 న 60 మందికి, మంగళవారం 18న 91 మందికి, బుధవారం ఒక్కరోజే 139, గురువారం 78 మందికి, శుక్రవారం 123 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఈనెలలో కరోనా కేసుల సంఖ్య 591తో 600 ల వరకు దగ్గరైంది.

