అభివృద్ధికి మా వార్డే సాక్ష్యం..!
– 13 వార్డులో 2.50 కోట్ల పనులు
– కళ్ళు మూసుకున్న బీఆర్ఎస్ నాయకులు
– ఎమ్మెల్యే, చైర్ పర్సన్ పై విమర్శలు మానుకోండి
– కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి ; తాండూరులో అభివృద్ధి జరుగుతుందని అనడానికి మా వార్డే సాక్ష్యం అని 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఎమ్మెల్యే, చైర్ పర్సన్ లతో పాటు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డిల సహాకారంతో వార్డులో రూ. 2కోట్ల 50 లక్షల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే రూ. 70 లక్షల మినహా అన్ని పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.

ఇంకా రూ.2 కోట్ల అభివృద్ధి పనులు టెండర్ దశలో ఉన్నాయని అన్నారు. తాండూరులో జరుగుతున్న అభివృద్ధికి మా వార్డే సాక్ష్యం అని అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక రాద్దాంతం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

గత కౌన్సిలర్ కూడా 5ఏండ్లు ఏ అభివృద్ధి చేయలేక పోయారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, చైర్ పర్సన్ పై విమర్శలు మానుకోవాలని, కోట్లాడి కాకుండా ఏం కావాలో అడిగి అభివృద్ధి చేసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.


