మహనీయకుల పోరాటమే తెలంగాణ
– ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్ర సాధన
– సీఎం కేసీఆర్‌తో అందరికి సంక్షేమ ఫలాలు
– రాష్ట్ర ఔన్యత్యాన్ని చాటేందుకే వజ్రోత్సవాలు
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎందరో మహనీయుల పోరాటం, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో విలీనం జరిగిందని, సీఎం కేసీఆర్ ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం విలియమూన్ పాఠశాలలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జాతీయ సమైక్యత వారోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఎంతో మంది ప్రాణాల త్యాగాలతో తెలంగాణ విలీనం జరిగిందని, సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అందరు తోడ్పాటు అందించడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పటయ్యిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, ఇంటింటికి తాగునీరు: అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అదేవిధంగా తాను మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్నో అభివృద్ధి పనులను తీసుకవడం జరిగిందని, ఇంకా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ నుహేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరుకు మంచి రోజులు వచ్చాయని, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డిల సహకారం మరువలేనిదన్నారు. తాండూరు అభివృద్ధిని ఆపడం ఎవరి తరం కాదని, అడ్డుకునే వారిని అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు.
ఉద్యమ కారులకు సన్మానం

తెలంగాణ జాతీయ సమైక్యత వత్రోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం నిర్వహించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కారులను సన్మానించారు. మరోవైపు వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వారిని కూడ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఎంపీపీలు బాలేశ్వర్ గుప్త, కరుణ అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, ఆర్డీఓ అశోక్ కుమార్, నోడల్ ఆఫీసర్ కోటాజీ, డీఎస్సీ శేఖర్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, మంకాల రాఘవేందర్, బోయ రవిరాజు, ఆసిఫ్, సంగీత ఠాకూర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మాజీ టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, వివిధ మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, శాఖల అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


