వరలక్ష్మీ వ్రత వైభోగం..!
– శంకర్ యాదవ్ నివాసంలో పూజా సందడి
– పూజలో పాల్గొన్న శంకర్ యాదవ్ దంపతులు
– హాజరైన ప్రజాప్రతినిధులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా తాండూర్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో వరలక్ష్మీ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. శంకర్ యాదవ్ సతీమణి చంద్రకళ వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకర్ యాదవ్ దంపతులు పూజలో పాల్గొనగా వేద పండితులు విశ్వం పంతులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శా ్రస్తోక్తంగా నిర్వహించారు.

వరలక్ష్మీ పూజ సందర్భంగా శంకర్ యాదవ్ నివాసం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్లు పట్లోళ్ల దీపా నర్సింలు, పట్లోళ్ల రత్నమాల నర్సింలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు, బీఆర్ఎస్ నాయక్ పట్లోళ్ల నర్సింలు, ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు, బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్, బంటుమల్లప్ప, మదనసింహారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు బంటువేణు, అల్లాపురం శ్రీకాంత్, బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, కౌన్సిలర్లు శ్రీకాంత్ రెడ్డి, అంతారం కిరణ్, రజినీకాంత్, నేతలు మాజీ కౌన్సిలర్లు డి అనురాధ రవీందర్, ప్రభాకర్ గౌడ్ .సంతోష్ కుమార్ గౌడ్, వెంకటేష్ చారి, సంజీవరావు, గోశాల సభ్యులు సోమాని, వేణుగోపాల్ రెడ్డి, పటేల్ విజయ్ కుమార్, జయంత్, జొన్నల వినోద్ కుమార్, మనోహర్ యాదవ్, కల్వ రవిశంకర్, కళ్యాణం చందు, ప్రేమ్ రాజ్, శ్రీనివాస్, సాగర్ గౌడ్, బంటారం మాజీ ఎంపీపీ రాములు యాదవ్, కురువ సంఘం నేతలు పూజారి పాండు, బందుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.



