కాంగ్రెస్ బలోపేతంలో కమిటిలే కీలకం

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ బలోపేతంలో కమిటిలే కీలకం
– తాండూరు పట్టణంలో నియామకాలు పూర్తి
– పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్
– హర్షం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో వార్డు కమిటిలు, బూత్ కమిటిలు కీలకంగా పనిచేయాలని పలువురు పార్టీ నాయకులు అన్నారు.

పార్టీ ఆదేశాలు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్‌ల ఆదేశాల మేరకు గత 5రోజులుగా తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో వార్డు కమిటి, బూత్ కమిటిల నియామకాలు చేపట్టారు. 5వ రోజు గురువారంతో తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో కమిటిల నియామకాలు పూర్తి అయ్యాయి.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, జిల్లా ఇంచార్జ్ శాఖం రాములు ముదిరాజ్, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌ రెడ్డి, సీనీయర్ నాయకులు కొళ్లి మల్లన్న, కోర్వార్ నాగేష్‌, లింగదలి రవికుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, అఫ్పూ(నయూం) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు అధ్యక్షులు, బూత్ కమిటి అధ్యక్షులకు నియామకపత్రాలను అందజేశారు.

అనంతరం పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో వార్డు కమిటిలు, బూత్ కమిటిలు కీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై పోరాడటానికి మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా జిల్లాలోనే వార్డు అధ్యక్షులు, బూత్ కమిటిల నియామకాలు తాండూరులోనే పూర్తి చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు హబీబ్ లాల, నాయకులు జలాల్, ప్రహ్లాద్, శివకుమార్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

రేపు ప్రైవేట్ స్కూల్స్ బంద్ పాటించాలి