మరోసారి కాగ్నాకు రంధ్రం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మరోసారి కాగ్నాకు రంధ్రం..!
– ఒక యేడాదిలో రెండోసారి పగుళ్లు
– నాణ్యతలోపంతో ప్రమాదంలో వంతెన
– వెల్లువెత్తుతున్న అనుమానాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాగ్నానదిపై మరోసారి రంధ్రం ఏర్పడింది. సరిగ్గా గత యేడాది జులై మాసంలో మొదటి సారి రంధ్రం ఏర్పడింది.

తాజాగా రెండోసారి మరో రంధ్రం పడింది. గత ఐదేళ్లలో రెండుసార్లు రంధ్రాలు పడడంతో వంతెన నాణ్యతపై అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాగ్నానదిపై కొత్త వంతెనను నిర్మించారు. సుమారు ఐదేళ్ల క్రితం నుంచి వంతెనపై రాకపోకలు సాగుతున్నాయి.

గత యేడాది జులై చివర్లో కాగ్నానదిపై రంధ్రప్రం ఏర్పడింది. సంబంధిత శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టెక్నాలజీతో మరమ్మత్తులు చేయించారు. ఇది పూర్తి అయిన యేడాదిలో కాగ్నానది ప్రమాదంలో పడింది. తాజాగా శుక్రవారం మరో రంధ్రం పడినట్లు వెలుగులోకి వచ్చింది. వంతెన రోడ్డుపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దానిపై నుంచి వెళ్లకుండా బారికేడ్‌లు ఏర్పాటు చేశారు.

అయితే బ్రిడ్జి నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు జరిగిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాంట్రాక్టర్‌ నాసిరకం మెటీరియల్‌ వినియోగించారా? నిర్మాణంలో నిబంధనలు పాటించారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.

23న తాండూరు కబడ్డీ పోటీలు