మచ్చలేని ఎమ్మెల్యే మనోహరన్న..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మచ్చలేని ఎమ్మెల్యే మనోహరన్న..!
– భద్రేశ్వర దేవాలయ అభివృద్ధి ఘనత ఆయనదే
– అవినీతి లేకుండా దుకాణాల నిర్మాణం
– ఓర్వలేని ఆరోపణలు మానుకోండి
– రెనవేషన్ కమిటి చైర్మన్ మేడి మహేష్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి, సంక్షేమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మచ్చలేని నాయకుడుగా పనిచేస్తున్నారని భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ మేడి మహేష్‌ అన్నారు.

బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై భూ కబ్జాలు, దేవాలయాల దుకాణాలలో అవినీతికి పాల్పడ్డారంటూ చేసిన వాఖ్యలను ఆయన ఖండించారు. శుక్రవారం దేవాలయంలోని దాసోహం మందిరంలో ఆయన, డైరెక్టర్లు, వ్యాపారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ హాయాంలో ఉన్న కమిటి సభ్యులు భద్రేశ్వర దేవాలయ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

ఇన్నేళ్లలో దాసోహం కట్టించలేకపోయారని విమర్శించారు. ఎమ్మెల్యే సహకారంతో దాసోహ మందిరం నిర్మించడంతో.. ఎంతో మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా శిథిలావస్థకు చేరిన దుకాణాల వల్ల ఇబ్బందులు రావద్దని, కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి.. వ్యాపారులకు అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా దేవాలయ సంబంధికుల నిర్మాణాలకు సహకారం అందించడం జరిగిందన్నారు. దుకాణాల నిర్మాణం, కేటాయింపులో ఎక్కడా అవినీతి లేకుండా ఎమ్మెల్యే దృష్టిసారించారని తెలిపారు.

దేవాలయాలనే కాకుండా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మచ్చలేని నాయకుడిగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ఆలాంటి ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నాయకులు ఒర్వలేక ఆరోపణలు, తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేపై దుష్ప్రచారాలకు పాల్పడడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, వ్యాపారులు తదితరులు ఉన్నారు.

మహిళలకు మొండి చెయ్యి..!