షోడా బండి ముసుగులో మద్యం దందా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

షోడా బండి ముసుగులో మద్యం దందా..!
– పట్టపగలే రోడ్డుపక్కన విక్రయాలు
– చర్యలు తీసుకోవాలంటూ కౌన్సిలర్‌ జావిద్ ఆగ్రహం
తాండూరు, దర్శిని ప్రతినిధి: షోడా బండి ముసుగులో ఓ వ్యక్తి మద్యం విక్రయాలు జరుగుతుండడంపై బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం తాండూరు పట్టణం మల్లప్ప మడిగ సమీపంలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు గుర్తించిన కౌన్సిలర్‌ జావిద్‌ అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పైకి షోడా బండి నిర్వహిస్తూ లోపల మిని మద్యం దుకాణాన్ని నిర్వహిస్తుండడంపై ఆశ్చర్యానికి గురయ్యారు.

మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న వ్యక్తిని ప్రశ్నించారు. ప్రధాన రహదారి పక్కనే పట్టపగలు ఇలాంటి విక్రయాలు సాగించేందుకు అనుమతులు ఎవ్వరిచ్చారంటూ నిలదీశారు. తాండూరు పట్టణంలో ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా అనధికారిక విక్రయాలు జరుపుతున్న వ్యక్తిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ