పల్లెలను మెరుగుదిద్దిన సర్కారు
– కేసీఆర్ విజన్ వల్ల గ్రామాల అభివృద్ధి
– గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ చేపట్టాలి
– వ్యాధుల నియంత్రణ కోసం సాగింగ్ మిషన్ల పంపిణీ
– తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెలకు అభివృద్ధి మెరుగులు దిద్దిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్లో తాండూరు నియోజకవర్గంలోని 123 గ్రామ పంచాయతీలకు రూ. 70 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో ఫాగింగ్ మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. ఒకప్పుడు ఊరి ముందు పారిశుద్ధ్యం, ఊరెనక పారిశుద్ధ్యం ఉంటే ప్రస్తుతం గ్రామాలన్నీ సస్యశ్యామలంగా మారాయన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో రైతు వేధికలు, స్మశాన వాటికలు, ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ట్యాంకులు, ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాలతో గ్రామాలకు అభివృద్ధి మెరుగులు దిద్దారని అన్నారు. అభివృద్ధి అంటే ఇతర దేశాలు తెలంగాణ వైపు చూ ఎలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుందని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పంచాయతీలకు ఫాగింగ్ మిషన్లను తాండూరు నియోజకవర్గంలోనే మొదటి సారి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అభినందించారు. దీంతో గ్రామాల్లో కోవిడ్ వ్యాక్సీనేషన్ పంపిణీని వంద శాతం పూర్తి చేసేలా దృష్టిసారించాలని సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న బిల్లుల సమస్యలు పరిష్కరించేలా చూస్తామన్నారు.
అభివృద్ధిలో కలిసి నడవాలి
తాండూరు నియోజకవర్గంలో నేతలు ఎలాంటి విద్వేషాలు పెట్టుకోవద్దని అన్నారు. తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి చేస్తున్నారని, గతంలో మంత్రిగా ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారని అన్నారు. తాండూరు అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే నేతలు తాండూరులోనే ఉన్నారని, కార్యకర్తలు ఎలాంటి విభేధాలు, ఈర్షలు లేకుండా కలిసి నడవాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు అభివృద్ధి కోసం మంత్రిగా ఉన్నప్పుడే నిధులు తీసుకరావడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు.
తాండూరు అభివృద్ధికి తప్పకుండా సహాకారం అందిస్తామన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్ధి కోసం రూ. 16 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సహకారంతో అన్ని గ్రామాలను అభివృద్ధిలో నడిపించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, యాలాల ఎంపిపి బాలేశ్వర్ గుప్త, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ. బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మార్కెట్ కవి టి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, రాజుగౌడ్, మాజీ డీ పీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల బాల్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), పెద్దేముల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, బషీరాబాద్ మండల అధ్యక్షులు రాములు నాయక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పబ్లిళ్ల రత్నమాల నర్సింలు, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి. కౌన్సిలర్లు పదోళ్ల నీరజా బాల్ రెడ్డి, బోయరవి, వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, టీఆర్ఎస్ యువనాయకులు బిర్కణ్ రఘు, అశోక్, సంతోష్ గౌడ్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

