‘చేతి’లో చల్లారని చిచ్చు..!
– క్యాంపు కార్యాలయం వద్ద ఫ్లెక్సీ చించివేత
– రోజు రోజుకు ముదురుతున్న వివాదం
– ఫోటోల ఫైట్ పై ప్రతిపక్షాల సెటైర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు చేతి పార్టీలో నాయకుల మధ్య రాజుకున్న చిచ్చు చల్లారడం లేదు.

నువ్వా.. నేనా అంటూ నేతల వైరం పెరుగుతుందా అన్నట్లు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. పట్టణంలోని రాజీవ్ కాలని వద్ద జరిగిన ఎమ్మెల్యే పర్యటనలో మున్సిపల్ చైర్ పర్సన్, సొంత పార్టీ కౌన్సిలర్ల మధ్య ఏర్పడిన విబేధాలు బహిర్గతం ఆయన సంగతి తెలిసిందే.

సాయిపూర్ కు చెందిన కౌన్సిలర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చైర్ పర్సన్ ఫోటో లేకావడంతో వివాదం నెలకొందని మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంపై రభస జరగడం చర్చనీయాంశం అయ్యింది. అది మరవక ముందే.. వివాదంలో కీలకంగా నిలిచిన ఇద్దరు కౌన్సిలర్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీనీ గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం పార్టీలో చిచ్చును రాజేందిందని పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఫ్లెక్సీ ఫైట్ లపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్లెక్సీలపై ఫోటోల కోసం మొట్టుకోవడం ఏంటని.. అభివృద్ధి కోసం దృష్టి సారించాలని సూచిస్తున్నారు.


