ఉర్దూఘర్ చైర్మన్‌గా అబ్దుల్ రజాక్
– నియామక పత్రం అందించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం ఉర్దూఘర్ చైర్మన్‌గా అబ్దుల్ రజాక్ నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి సూచనల మేరకు తాండూరు పట్టణం సాయిపూర్‌లోని ఉర్దూఘర్ నిర్వహణ కమిటిని ఏర్పాటు చేశారు.
కమిటి చైర్మన్‌గా ఇందిరానగర్‌కు చెందిన అబ్దుల్ రజాక్, సభ్యులుగా మహమ్మద్ అన్వర్ ఖాన్, అస్లాం బిన్ అసద్, ఎండీ ఇబ్రహీం ఖాన్, రజీయా భేగం, అబ్దుల్ రహమాన్, వీ.కృష్ణ(ఉర్దూ అకాడమి), కన్వినర్‌గా తాండూరు తహసీల్దార్‌లు ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఈ కమిటి పదవికాలం ఉంటుంది. నూతనంగా ఎన్నికైన ఉర్దూఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌కు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నియామకపత్రం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు.
