శాంతి భద్రతలకు అందరు సహకరించాలి
– వికరాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి
– జిల్లా ఎస్పీగా బాధ్యతల స్వీకరణ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అందరు సహకరించాలని వికారాబాద్ జిల్లా నూతన ఎస్పీ ఎన్.కోటిరెడ్డి అన్నారు. మహబూబబాద్ జిల్లా ఎస్పీగా ఉన్న ఎన్.కోటిరెడ్డిని వికారాబాద్ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ గత మూడేళ్లుగా ఎస్పీగా విధులు నిర్వర్తించిన నారాయణకు ఐపీఎస్‌గా పదోన్నతి కల్పించి స్థాన చలనం కల్పించింది. ఇందులో భాగంగా బదిలీపై వచ్చిన ఎన్.కోటిరెడ్డి వికారాబాద్ జిల్లా ఎస్పీగా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
జిల్లా అడిషనల్ ఎస్పీ రషీద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డికి పుష్చగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీగా కోటిరెడ్డి సంతకం చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోశాంతి భద్రతల విషయంలో ప్రజలు జిల్లా పోలీసు శాఖకు సహకరించాలన్నారు. అదేవిధంగా పోలీసుల విధుల పట్ల జిల్లా సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ శ్రీ సత్యనారాయణ, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూరు డీఎస్పీ లక్ష్మినారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, జిల్లాలోని వివిధ స్టేషన్ల ఇనుస్పెక్టర్లు, సర్కల్ ఇనుస్పెక్టర్లు, ఆర్‌ఐలు, జిల్లా పోలీస్ శాఖ ప్రెసిడెంట్ టి.అశోక్, సిబ్బంది జిల్లా నూతన ఎస్పీకి పుష్పాగుచ్చాలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

