జాతర ఉత్సవాలకు ఎల్లమ్మ ఆలయం ముస్తాబు
– ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం ముద్దాయిపేట్ లో వెలసిన శ్రీ జగన్మాత ఎల్లమ్మ దేవాలయం ఈ నెల 30న జరిగే తిరుణాల జాతర ఉత్సవాలకు ముస్తాబయ్యింది.
జాతర ఉత్సవాల కోసం ఆలయ కమిటి శాశ్వత ధర్మకర్త స్వర్గీయ దేవగారి రామయ్య కుమారుడు సిద్దయ్య, స్వర్గీయ సంగయ్య, ఎంపీటీసీ దేవగారి రాములు, సర్పంచ్ కృష్ణయ్య, మాజీ సర్పంచ్ కోడూరి విఠలయ్య, చాకలి లక్ష్మీ, పంచాయతీ సెక్రటరీ కిరణ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు దేవగారి రమేష్లు ఏర్పాట్లను పూర్తి చేశారు. జాతర ఉత్సవాలలో భాగంగా 30న అమ్మవారి ఊరేగింపు, 31న సిడీ, వచ్చే యేడాది జనవరి 1న చుక్క బోనాలు జరుగుతాయని చెప్పారు. అదేవిధంగా ప్రతిరోజూ భజన కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. కావున భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ జాతర ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు.
