దేవీ నమోస్తుతే..!
– దేవాలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేవాలయాల్లో కొలువు దీరిన అమ్మవార్లను భక్తలు దేవీ నమోస్తుతే అంటూ దర్శించుకుంటున్నారు. శ్రావణామాసం రెండో శుక్రవారాన్ని భక్తులు వరలక్ష్మీ శుక్రవారంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని నెహ్రుగంజ్ ఆవరణలో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ, కాళీకాదేవి ఆలయంలో కాళికాదేవీ అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు.
ఎల్లమ్మ దేవాలయంలో ఆలయ పూజారి అంమ్రేష్ పంతులు అమ్మవారిని వరలక్ష్మీ దేవీగా అలంకరించారు. కాళికాదేవీ ఆలయంలో కూడ అమ్మవారు వరలక్ష్మీ దేవీగా దర్శనమిచ్చారు. మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని అమ్మవార్లను దర్శించుకున్నారు.