సావిత్రి బాయి పూలే జీవితం ఆదర్శప్రాయం
– ప్రతిభ పాఠశాలలో ఘనంగా జయంతి
యాలాల, దర్శిని ప్రతినిధి : భారత తొలి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జీవితం ఆదర్శ ప్రాయమని యాలాల మండలం రసూల్‌పూర్ సమీపంలోని ప్రతిభ పాఠశాల నిర్వహకులు పేర్కొన్నారు. సోమవారం పాఠశాలలో సావిత్రి భాయి ఫూలే 191వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల నిర్వహకులు, విద్యార్థులు సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా, కవియిత్రిగా, సామాజిక సంఘసంస్కర్తగా సమాజ అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలు మారువలేనివి అని కొనియాడారు. దేశంలో స్త్రీ విద్యా, స్త్రీ సాధికారత, సమానత్వం, కులతత్వ నిర్ములన, సామాజిక రుగ్మతలపై చదువే ఆయుధంగా పోరాడిన ఆదర్శమూర్తి సావిత్రి భాయి ఫూలే పేర్కొన్నారు. అలాంటి మహానియురాలు జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకొని సమసమాజ స్థాపన కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు నిర్ని చంద్రశేఖర్, పర్యాద రామకృష్ణ, ప్రిన్సిపాల్ రవికుమార్, ఉపాధ్యాయులు మధు ,వీరేశం,సంతోష, స్నేహ, శ్రద్ద, మనీషా విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

