స్థానికం.. దగ్గరగా.. దూరంగా..!
– ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే పరిణామాలు
– ఎన్నికల నోటిఫికేషన్‌పై సమాలోచనలో సర్కారు..?
– రిజర్వేషన్లు, రాజకీయ వ్యూహాల కోణంలో వెనుకడుగు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : స్థానిక సమరం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను ఊరిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ నెలాఖరు వరకు ఎన్నికల నోటిఫిషన్ వేస్తామని ప్రకటించడంతో అన్ని పార్టీలు స్థానిక ఎన్నికల కోసం వ్యూహాలకు సిద్దమవుతోంది. అయితే తాజా పరిణామాలతో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర్లో కాదు.. దూరంగా ఉన్నాయని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సమరంలో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటిసి ఎన్నికల తరువాత సర్పంచుల ఎన్నికలు నిర్వహించాలని భావించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వెంటనే మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలని నిర్ణయించింది కూడా. రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సమరంకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వాఖ్యలు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి.

ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కుల గణన స్థానిక ఎన్నికల వెనకడుగుకు కారణంగా నిలుస్తుందని చెప్పవచ్చు. సర్వే ప్రకారం బీసీలకు 42 శాతం వాటా కల్పించాలని, ఆ తరువాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో బీజేపీ, బీఆర్ఎస్, ఇతర పార్టీలు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించాలని వ్యూహాలు వేస్తున్నట్లు ప్రభుత్వానికి నిఘా వర్గాల సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో సమస్యలు, రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుని ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. దీనికి తోడు ఎన్నికల నిర్వహణ అధికారులకు శిక్షణలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది.

ఇదికూడా చదవండి…

