ఇంటింటా వరలక్ష్మీ వత్రాలు
– శంకర్ యాదవ్ నివాసంలో అట్టహాసంగా పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో ఇంటింటా వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా జరిగాయి. వరలక్ష్మీ వ్రతాలను పురస్కరించుకొని ఇండ్లలో లక్ష్మీ దేవతలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియమ నిష్టలతో వరలక్ష్మీ వ్రతాలను దీక్షగా చేపట్టారు. వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, తమ పిల్లా పాపలను చల్లగా చూడాలని
అమ్మవారికి పూజలు నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి బావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో వరలక్ష్మీ వ్రతం అట్టహాసంగా నిర్వహించారు. ఈ పూజల్లో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరోవైపు శంకర్ యాదవ్ నివాసంలో జరిగిన వరలక్ష్మీ వ్రత పూజలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు బంటు మల్లప్ప, బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్‌కుమార్, మనోహర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.