వైభోగంగా భోగి సంబరం
– రంగవల్లులతో విరాజిల్లిన తెలుగు ఇళ్లు
– గాలిపటాలు ఎగురవేసిన చిన్నారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలుగు సంప్రదాయాల పెద్ద పండగ సంక్రాంతిలో భాగంగా మొదటి రోజు భోగి పండగను తాండూరు ప్రజలు వై గంగా జరుపుకుంటున్నారు.
భోగి పండగ సందర్భంగా తాండూరులోని తెలుగు ఇండ్లన్ని రంగులమయంగా విరాజిల్లాయి. ఇండ్ల ముందు అందమైన రంగవల్లులు స్వాగతం పలికాయి. శుక్రవారం ఉదయమే మహిళలు, యువతులు నిద్రలేచి అందమైన ముగ్గులు వేశారు.
అనంతరం స్నానమాచరించి అం దైమన ముగ్గుల్లో గొబ్బెమ్మలు ఉంచి పూజలు నిర్వహించారు. దీంతో ఇంటింటా భోగం వైభోగం తాండవించింది. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా కొత్త అళ్లుల రాకతో తెలుగు ఇండ్లన్ని పండగ సందడితో నిండుకున్నాయి. సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చే పిండి వంటలు అందరి ఇండ్లలో ఘుమఘుమలు రేపాయి.
మరోవైపు సంక్రాంతి సందర్భంగా చిన్నారులు ఉత్సహాంగా గాలిపటాలు ఎగురవేశారు. తాండూరు అంతా భోగి వైభోగం సంతరించుకుంది.

