మనఊరు – మన బడిపై హర్షం
– సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నూతన సంస్కరణలకు బాటలు వేస్తూ ప్రవేశ పెడుతున్న మన ఊరు – మన బడిపై తాండూరులో పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తాండూరు డివిజన్ కమిటి అధ్యక్షులు జిలాని, టీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో సమూల సంస్కరణలకు మన ఊరు – మన బడితో శ్రీకారం చుట్టిందన్నారు. రూ. 7289 కోట్లతో కేబినెట్ అమోదించడం హర్షించదగ్గ విషయమన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల వసూళ్లకు కట్టడి సాధ్యమవుతుందని అన్నారు. సర్కారు బడగుల బాగుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు.

