మైనార్టీల సంక్షేమానికి కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

మైనార్టీల సంక్షేమానికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులో మైనార్టీల సంక్షేమానికి కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం తాండూరు పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి తోడ్పాటు అందించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. అదేవిధంగా ముర్షధ్ దర్గా వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాబర్, వైస్ ప్రెసిడెంట్ సల్లో, నాయకులు ఆహద్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నయ్యుం అఫు, ఎంఐఎం అధ్యక్షుడు హాది, మాజీ కౌన్సిల‌ర్ జుబేర్ లాలా, కౌన్సిల‌ర్ ముక్తార్ నాజ్ పాల్గొన్నారు.