విదేశీ కలుపు మొక్కల నివారణకు కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

విదేశీ కలుపు మొక్కల నివారణకు కృషి
– వాటి వల్ల జీవనోపాధికి ఎంతో ముప్పు
– నివారణ పనులను ఉపాధి హామిలో చేర్చాలి
– ఈకోఫాన్ సోసైటి ఆధ్వర్యంలో అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : విదేశి కలుపు మొక్కల నివారణకు అందరు కృషి చేయాలని ఈకో ఫోన్ సోసైటీ ప్రతినిధులు మెట్టు సాయి సంపత్, తలారీ ప్రభాకర్‌లు అన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో విదేశీ కలుపు మొక్కల నివారణపై అవగాహన కల్పించారు. మండలంలోని బాద్లాపూర్, కాశింపూర్, రెడ్డిగణాపూర్ గ్రామాలలో పెద్దలు, యువకులు, స్వయం సహాయక సంఘాలతో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఈకో ఫాన్ సోసైటీ ప్రతినిదులు మాట్లాడుతూ విదేశి కలుపు మొక్కలు జీవ వైవిధ్యంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతకు తీవ్ర ముప్పుగా నిలుస్తున్నాయని అన్నారు.

వయ్యారి భామ, సీస కమ్మరి, ఇగడ, బుడిది అళo, ముల్లపూ అళo తదితర ఆక్రమక కలుపు మొక్కలు దుష్ప్రభావం చూపుతాయన్నారు. విదేశీ ఆక్రమక కలుపు మొక్కలు స్థానిక వృక్షజాలంతో పోటీ పడుతూ వ్యవసాయ ఉత్పాదకతను తగ్గించడమే కాకుండా కలుపు నివారణకు ఖర్చులు పెరుగుతాయన్నారు. దీంతో దిగుబడులు తగ్గి జీవనోపాధికి ముప్పు కలిగిస్తాయన్నారు. ఈ మొక్కలతో పశువులకు మేత తగ్గుతుందని వివరించారు. కావున విదేశీ కలుపు మొక్కల నివారణకు అందరు కృషి చేయాలన్నారు. అదేవిధంగా విదేశి కలుపు మొక్కల నివారణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపాధి హామి పథకంతో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈకో ఫాన్ సొసైటీ ప్రతినిధులు అవుటి రాజశేఖర్, మహమ్మద్ షా ఫైసల్ నవీన్, శివ కుమార్, శ్రీనివాస్, సురేష్, మహేష్, పాండు ఆయా గ్రామాల పెద్దలు, స్వయం సహాక సంఘాలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ట్రాఫిక్ నియంత్రణకు మేము సైతం..!