కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ద
– మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
– హెల్త్ క్యాంపులో వైద్య పరీక్షల నిర్వహణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాలపై శ్రద్ధ వహించడం జరుగుతుంని కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 100 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు.

తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్యులు, బృందం ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బంది, ఆర్పీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, జ్వరం, దగ్గు వంటి తదితర పరీక్షలు నిర్వహించి వైద్య సేవలను అందించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డి మాట్లాడుతూ సీడీఎంఏ ఆదేశాల మేరకు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికుల ఆరోగ్యాలపై శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు. కార్మికులు, సిబ్బంది వైద్య శిభిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనారోగ్యానికి గురికాకుండా వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్ ఉమేష్ కుమార్, మెప్మా టీఎంసీ రాజేందర్, అధికారులు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

