తాండూరు ఆర్టీసీ డీఎం బదిలీ
– కొత్త డీఎంకు జీఎన్ పవిత్ర
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ రాజశేఖర్‌కు స్థానచలనం లభించింది. ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్వర్తులు జారీ చేసింది. హైదరాబాద్ బస్ భవన్‌లోని కంప్యూటర్ విభాగానికి బదిలీ చేసినట్లు ఆ ఉత్తర్వులులో పేర్కొన్నారు. తాండూరు డీపో మేనేజర్‌గా రాజశేఖర్ స్థానంలో కొత్త డీపో మేనేజర్‌గా జీఎన్ పవిత్రను నియమించారు. ప్రస్తుతం జీఎన్ పవిత్ర హైదరాబాద్ బస్ భవన్‌లోని కంప్యూటర్ విభాగంలో ఏటీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు తాండూరు డీపో మేనేజర్‌గా రాజశేఖర్ దాదాపు మూడేళ్ల నాలుగు నెలల పాటు విధులు నిర్వహించారు. రెండు, మూడు రోజుల్లో ఆయన తాండూరు నుంచి రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. తాండూరులో ఇన్నేళ్లపాటు తనకు సహాకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.


